పెనుకొండలో కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని పులేకమ్మ ఆలయ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు గాయపడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బెంగళూరు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు గుంతలో పడి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.