గుంతకల్లు: గుత్తిలో అరగంట పాటు ట్రాఫిక్ జామ్, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ప్రజలు
గుత్తిలోని గాంధీ సర్కిల్, రాయల్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో బుధవారం ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్ద పెద్ద వాహనాలు రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తింది. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతున్నదని వాహనదారులు వాపోయారు.