ఆదోని: మహిళలకు మరుగుదొడ్ల ఏర్పాటులో నిర్లక్ష్యం తగదు:ఆదోని జై భీమ్ యూత్ నాయకులు నాగరాజ్
Adoni, Kurnool | Nov 1, 2025 ఆదోని మున్సిపల్లో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో జై భీమ్ యూత్ తరఫున నాగరాజు మహిళల మరుగుదొడ్ల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యాన్ని లేవనెత్తారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మహిళలకు కనీసం మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళల మరుగుదొడ్ల విషయంలో పలుసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు హామీలను నిలబెట్టుకొని సమస్య పరిష్కరించాలన్నారు.