పాణ్యం: పాణ్యం టీడీపీ నూతన మండల, క్లస్టర్, బూత్ ఇన్చార్జీల ప్రమాణ స్వీకారం ఘనంగా
.నంద్యాల చెక్పోస్ట్లోని దేవీ ఫంక్షన్ హాల్లో పాణ్యం నియోజకవర్గ టీడీపీ నూతన మండల కన్వీనర్లు, క్లస్టర్, బూత్ ఇన్చార్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, సీనియర్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి, టీటీడీ సభ్యుడు మల్లెల రాజశేఖర్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.