జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని పెనుకొండ ఆర్డిఓ ఆనంద్ బాబు కు జర్నలిస్ట్ సంఘాల నాయకులు విన్నతి
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్టీవో ఆనంద్ బాబుకు జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు సోమవారం మధ్యాహ్నం వినతిపత్రం ఇచ్చారు. చిలమత్తూరు మండలానికి చెందిన ఓ దినపత్రిక విలేకరి ‘నాసిరకంగా రోడ్లు వేస్తున్నారు' అంటూ వార్త రాశారు. దీంతో కాంట్రాక్టర్ నాగరాజ్ యాదవ్ విలేకరిపై కక్ష్య పెంచుకొని, అతనిపై, అతని కుటుంబభ్యులపై దాడికి పాల్పడ్డాడని, నాగరాజుపై చర్యలు తీసుకోవాలని విలేకరులు భాను, ప్రకాష్, మధు, మురళి డిమాండ్ చేశారు.