వెలుగోడు మండలం రేగడగుడూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని రైతులకు రాజముద్రతో కలిగిన పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ,నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పీపీబీలను తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.ప్రజలకు శాంతి భద్రతలు, పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు..ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.