పత్తికొండ: తుగ్గలి లో ఏసీబీ అధికారులకు పట్టుబడిన RWS ఏ ఈ నరేష్ వివరాలు వెల్లడించిన అధికారులు
తుగ్గలి ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈగా పనిచేస్తున్న నరేశ్‌ను శనివారం సాయంత్రం ACB అధికారులు పట్టుకున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన రోడ్డు బిల్లులు చెల్లించే విషయంలో ఎంపీటీసీ రాజు నుంచి రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదైనా రికార్డులు తయారుచేయకుండా బహిరంగంగా డబ్బులు డిమాండ్ చేశాడని ACB అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపారు.