బంగారుపాళ్యం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులు ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలి అంటే క్రమం తప్పకుండా స్కీనింగ్ చేసుకోవాలనిg తెలిపారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నోరు,రొమ్ము,గర్భాశయ ముఖ ద్వారం స్కీనింగ్ చేయించుకోవాలని అన్నారు.ఈh కార్యక్రమంలో డాక్టర్ షాలిని,డాక్టర్ విజయకుమారి,డాక్టర్.రాగ భావన,డాక్టర్.స్వాతి,సుమతి బాయ్,కౌన్సిలర్ డి.బాబు,రోహిణి తదితరులు పాల్గొన్నారు