మంత్రాలయం: ఆదోని శివారులోని మెడికల్ కళాశాలను మాజీ సీఎం జగన్ ఓసారి చూడాలి: పెద్ద కడబూరు టిడిపి రైతు అధికార ప్రతినిధి
పెద్ద కడబూరు తెలుగుదేశం రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి మరియు నరవ శశిరేఖ సోమవారం ఆదోని శివారుల్లో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాల నీట మునిగిందని చెప్పారు. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడే జగన్ ఆదోని కళాశాలను ఓసారి చూడాలని హితవు పలికారు.