కరీంనగర్: కరీంనగర్ లోని ప్రయివేటు విద్యా సంస్థల్లోని కిచెన్, డైనింగ్ హాల్ లను తనిఖీ చేసి జరిమానా విధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
కరీంనగర్ లోని పలు ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు నగరంలోని కోటా జూనియర్ కాలేజీ,అలుగునూర్ లోని ఎస్.ఆర్ జూనియర్ కాలేజీ లోని హాస్టల్ లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా కాలేజీల కిచెన్, డైనింగ్ హాలును పరిశీలించారు.రెండు కాలేజీల కిచెన్లలో పలు లోపాలను గుర్తించిన అధికారులు ఆయా విద్యా సంస్థ లకు నోటీస్ లు జారీ చేశారు.ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనుమతి మేరకు జరిమానా విధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కరీంనగర్ లోని ప్రయివేటు విద్యా సంస్థల్లోని హాస్టల్ కిచెన్ అపరిశుభ్రంగా ఉంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు.