తడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుపట్టలేని విధంగా మృత దేహం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని అక్కంపేట - తడ రైల్వే స్టేషన్ మధ్య గ్రంథ గుంట గ్రామ సమీపంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు 45 నుండి 55 ఏళ్ళ మధ్య ఉన్న మగ వ్యక్తి మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారింది. ఈ మేరకు సమాచారం అందుకొన్న సూళ్లూరుపేట జి ఆర్ పి ఓ పి ఆర్ పి ఎస్ ఐ చెన్నకేశవ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో గుర్తు తెలియని మృతదేహాన్ని సూళ్లూరుపేట వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గుర్తించిన వారు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలియజేశారు.