బాణసంచా దుకాణదారులకు ఎమ్మెల్యే బొజ్జల అభయ హస్తం శ్రీకాళహస్తిలో బాణసంచా విక్రయించరాదని ప్రాంగణంలో ఉన్న గేటుకి మున్సిపల్ సిబ్బంది తాళాలు వేసి విద్యుత్ దీపాలను ఆపారు. దీంతో బాణసంచా యాజమాన్యులకు, మున్సిపల్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన దుకాణదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాను మాట్లాడుతానని హామీ ఇచ్చారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వెను తిరిగారు.