వనపర్తి: పౌష్టికాహారం పై అవగాహన కలిగించడమే పోషణ మాసం ముఖ్య ఉద్దేశం : వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
బుధవారం గణపురం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ వరకు పోషణ మాసం అనే కార్యక్రమాన్ని వనపర్తి ఎమ్మెల్యే మేఘ రెడ్డితో కలిసి ప్రారంభించిన వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో దొరికే పౌష్టికాహారం పై అవగాహన కలిగించడం మే ముఖ్య ఉద్దేశమని పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి పోషణ మాసంలో తెలియజేస్తారన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిందని కావున పోషణ మాసంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.