ప్రకాశం జిల్లాలోని ఓ చెరువులో కనిపించిన వలస పక్షులు, వాతావరణ మార్పులతో ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా గుర్తించిన స్థానికులు
Ongole Urban, Prakasam | Oct 20, 2025
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని చెరువులో వలస పక్షులు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం వర్షాలు పడుతూ వాతావరణంలో మార్పు వచ్చిన సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వలస పక్షుల చేరుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు. వారి మొబైల్లో ఆ దృశ్యాలను బంధించి ఆనందం వ్యక్తం చేశారు. ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చిన వలస పక్షులను చూడడానికి స్థానిక ప్రజలు ఆసక్తిని కనబరిచారు.