రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నా నియోజకవర్గంలో ఉండడం అదృష్టం : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆయన పాల్గొన్నారు. ఆలయం తన నియోజకవర్గంలో ఉండడం తన అదృష్టం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు