అడ్డంకులను అధిగమించి ఆపరేషన్ స్వర్ణ ముందుకు తీసుకెళుతున్నామని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుడా పైన నమ్మకంతో ఆపరేషన్ స్వర్ణ తమకు అప్పగించారని ఎన్ని అడ్డంకులు వచ్చిన హైడ్రాతరహాలో స్వర్ణముఖి నది ప్రక్షాళన ముందుకు వెళ్తామని చైర్మన్ తెలిపారు స్వర్ణముఖి నది ఆక్రమణల తొలగింపు ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే డ్రోన్ సర్వే జరుగుతుందని తెలిపారు.