మంత్రాలయం: ఎరిగేరి గ్రామంలోని శ్రీ బసవేశ్వర శివాలయంలో వైభవంగా నూతన విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు
కౌతాళం :ఎరిగేరిలో శ్రీ బసవేశ్వర శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున నుంచి వేదపండితులు హోమాలు చేశారు. ఆలయంలో శివలింగం, మహాగణపతి, ధ్వజస్తంభం, పార్వతి దేవి, నందీశ్వర విగ్రహలాను ప్రతిష్ఠించారు. ధ్వజ స్తంభం, కలశ స్థాపన చేశారు. ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు.