గిద్దలూరు: తాత్కాలిక లైసెన్స్ లో లేకుండా దీపావళి టపాసులు మందు సామాగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు: గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య
తాత్కాలిక లైసెన్సు లేకుండా దీపావళి ముందు సామాగ్రి విక్రయించరాదని గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కొమరోలు, రాచర్ల మండలాలలోని దీపావళి టపాసులు విక్రయిస్తున్న దుకాణాలను సీఐ రామకోటయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాగ్రత్తలు పాటిస్తూ దుకాణాలు ఏర్పాటు చేశారా లేదా అని పరిశీలించి దుకాణదారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సీఐ రామకోటయ్య మీడియాకు తెలిపారు.