విశాఖపట్నం: సమష్టి కృషితోనే అద్భుత విజయం సాధించగలిగాం,
యోగాంధ్ర అభినందన సభలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకంలో రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సమష్టి కృషి , ప్రజా ప్రతినిధుల సహకారంతోనే యోగాంధ్ర కార్యక్రమంలో విజయం సాధించగలిగామని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఉడా చిల్డ్రన్ ఏరీనాలో నిర్వహించిన అభినందన సభలో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించిన అన్ని విభాగాల అధికారులు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియాడారు. పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు ప్రశంసనీయ పాత్ర పోషించాయని కొనియాడారు.