అబ్దుల్లాపూర్ మెట్: తుర్కయంజాల్లో తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు ఆందోళనకు దిగిన బాధితురాలు
పెళ్ళీ చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువకుని ఇంటి ముందు ఆందోళనను దిగింది బాధితురాలి కుటుంబం. నంద కుమార్ అనే వ్యక్తి ఇంటిముందు కూర్చున్న బాధితులు... గత ఆరు నెలల క్రితం పెళ్లి చూపులకు వచ్చి వెళ్లిపోయిన నంద కుమార్ అమ్మాయి నెంబర్ తీసుకొని అన్ని రకాలుగా వాడుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెబుతునట్లు ఆవేధన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పెళ్ళి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మరోసారి మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు