వనపర్తి: వనపర్తి లో దొంగల అరెస్ట్ నగదు బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు
సోమవారం వనపర్తి జిల్లా పోలీసులు బొంతలు కుట్టే వ్యాపారం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచిన వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్న ఆరుగురు దొంగలను పట్టుకుని వారి వద్ద నుండి 25 వేల రూపాయలు నగదు 25 గ్రాముల బంగారం మూడు తులాల వెండి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సిఐ కృష్ణయ్య రూరల్ ఎస్సైలు జలంధర్ రెడ్డి వేణుగోపాల్ను డి.ఎస్.పి ప్రత్యేకంగా అభినందించారు.