చర్లపల్లిలో కేబుల్స్ నుంచి ఐకాన్ వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు స్తంభాన్ని ఒక కారు ఢీకొనడంతో స్తంభం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదాన్ని నివారించేందుకు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.