కరీంనగర్: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్య దృష్టి వీడియో ఆల్బమ్ ను ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్య దృష్టి వీడియో ఆల్బమ్ ను మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎదుట పాట పాడి వినిపించారు. ఈ పిల్లలు దివ్య దృష్టి గల సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో ఉన్న స్తోత్రాలను కూడా అలవోకగా పాడడం అభినందనీయమన్నారు సిఎం.