కళ్యాణదుర్గం: పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయాలని చూడడం చాలా దుర్మార్గమైన విషయం: మాముడూరులో మాజీ ఎంపీ తలారి రంగయ్య
పేద, మధ్య తరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయాలని కూటమి ప్రభుత్వం చూడడం చాలా దుర్మార్గమైన విషయమని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. బ్రహ్మసముద్రం మండలం మాముడూరు గ్రామంలో గురువారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానీయమన్నారు. ఎన్ని ఉద్యమాలు, పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. మనమందరం కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు.