అసిఫాబాద్: జిల్లాలో మెడికల్ షాపు పెట్టాలంటే రూ.30 వేలు ఇవ్వాల్సిందే:CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్
ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ షాపు పెట్టాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ అనుమతి కంటే మెడికల్ సంఘం నాయకుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో ఏర్పడిందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో నూతన మెడికల్ దుకాణాలు పెట్టాలంటే యూనియన్ నాయకుల చేతుల్లో రూ.30 వేలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ షాపుల్లో నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు.