పాలకొండలో జరిగిన సిఐటియు జిల్లా మహాసభల్లో పాటల పాడి అలరించిన ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణ మూర్తి
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో గత రెండు రోజులుగా సిఐటియు 11వ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ముగింపు సభలో సినీ నటులు ఆర్.నారాయణమూర్తి పాల్గొని చైతన్య గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులుగా డి.రమణ రావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వై. మన్మధరావు జిల్లా కోశాధికారిగా జి.వెంకటరమణను ఎన్నుకున్నారు.