పూతలపట్టు: ఓటివారిపల్లి ఎస్టీ కాలనీలో స్వర్ణాంధ్ర–స్వఛ్ఛ ఆంధ్ర కార్యక్రమం యాదమరి తహసిల్దార్ పార్థసారథి
యాదమరి మండలం ఓటివారిపల్లి ఎస్టీ కాలనీలో శనివారం స్వర్ణాంధ్ర–స్వఛ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పార్థసారథి పాల్గొని కాలనీవాసులతో సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గిరిజనులకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు పక్కా ఇళ్ల లేమి, శ్మశానానికి దారి సమస్య, ఆధార్ కార్డుల సమస్యలను తీసుకురాగానే వెంటనే పరిష్కారానికి తగిన చర్యలు