కర్నూలు: డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది: రాష్ట్ర మంత్రి టీజీ భరత్
కర్నూలు లో ఈగల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దుబ్రో సైకిల్ తొక్కుబ్రో కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు రాష్ట్ర మంత్రి టీజీ. భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, ఈగల్ ఎస్పీ నగేష్ బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు నుంచి ఆర్.ఎస్. రోడ్డు కూడలి వరకు ఈర్యాలి నిర్వహించారు. దాదాపు 400 మంది సైకిల్ తొక్కుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకిల్ ర్యాలీ మొత్తం పూర్తి అయ్యేంత వరకు మంత్రి భరత్ సైకిల్ తొక్కారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు.