ఐనవోలు: పంతిని శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న గ్రెనేడ్ లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని శివారు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న గ్రెనేడ్ లారీని ఆటో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలపాలయ్యారు. రోడ్డు ప్రక్కన నిర్లక్ష్యంగా లారీ ఆపగా.. వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఆటో లారీని ఢీకొట్టింది.ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.