కరీంనగర్: త్వరలో దేవర-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న : కరీంనగర్ లో సిని హీరో శ్రీకాంత్
కరీంనగర్ తెలంగాణలోనే బెస్ట్ సిటీగా అని ఎప్పుడు లేని విధంగా ఎంతో అభివృద్ధి చెందిందని సినీ హీరో శ్రీకాంత్ అన్నారు. గత పది రోజులుగా కరీంనగర్ పట్టణంలో ఏడు కొండలవాడ వెంకట రమణ గోవిందా గోవిందా అనే సినిమా షూటింగ్ బుధవారం సాయంత్రం 5గంటలకు జరుగుతుంది. నగరంలోని కిషన్ నగర్ లో హీరో, హీరోయిన్ చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో కరీంనగర్ కు రావడం,కరీంనగర్ లో తన సినిమా షూటింగ్ జరగడం ఎంతో సంతోషంగా ఉందని కరీంనగర్ ప్రజలు ఎంతో అప్యాయంగా పలకరిస్తున్నారన్నారు. చిరంజీవితో మళ్లీ సినిమా చేసే అవకాశం ఉందన్నారు. తన తదుపరి సినిమా దేవర-2 తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అన్నారు.