సంగారెడ్డి: అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం పెంచాలి: సంగారెడ్డిలో యూనియన్ జిల్లా కార్యదర్శి మంగ
అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని యూనియన్ జిల్లా కార్య దర్శి మంగ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.