విజయవాడ ఉత్సవ్ ను అడ్డుకునేందుకు వైసిపి కుట్రలు: ఎంపీ కేసునేని చిన్ని ధ్వజం
విజయవాడ ఉత్సవ్ ను అడ్డుకునేందుకు వైసిపి కుట్రలు చేస్తోందని ఎంపీ కేసినేని చిన్ని ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం 6:00 సమయంలో విజయవాడలో ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, పేర్ని నాని ఇరువురు రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్లు వేశారని ఆరోపించారు. తాము కోర్టుకు వాస్తవాలను సమర్పించి విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు.