బందరు రూరల్ తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికెట్ల జారీపై ఎంపీడీఓ వెంకటేశ్ వివరణ
Machilipatnam South, Krishna | Sep 16, 2025
తాళ్లపాలెం సచివాలయంలో జగన్ ఫోటోతో సర్టిఫికెట్ల జారీపై ఎంపీడీఓ వివరణ స్తానిక మచిలీపట్నం రూరల్ తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికెట్ల జారీపై మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఎంపీడీఓ వెంకటేశ్ వివరణ ఇచ్చారు. డిజిటల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్, సర్టిఫికెట్ల హార్డ్ కాపీలు అయిపోవడంతో పాత ప్రభుత్వంలో ముద్రించిన వాటిని ఉపయోగించినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ కు నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు.