సత్తుపల్లి: రామగోవిందాపురంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే రాగమయి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామ గోవిందాపురం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.ప్రారంభోత్సవ సమయంలో గ్రామంలో మంచినీటి సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై మంత్రి తుమ్మల మండిపడ్డారు.తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా ప్రధాన రహదారుల వెంట చెత్తాచెదారం ఉండటంతో పంచాయతీ అధికారులను మందలించారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.