మహదేవ్పూర్: కాటారంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులు, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి వేడుకలు ఆదివారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గారేపల్లి కూడలి లో గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నిలువెత్తు పూలమాలలతో అలంకరణలు చేసి, అంగరంగ వైభవంగా నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాటారం మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ, తెలంగాణ జాతిపితగా ఖ్యాతికెక్కిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజ