కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కడప తాడిపత్రి జాతీయ రహదారి. శ్రీనగర్ కాలనీ కి వెళ్లే దారి దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు దాటుతూ వెళుతున్న వ్యక్తిని బొలెరో వాహనం డీ కొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని గోపలాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.