వట్పల్లి: వట్పల్లీ అక్షర పాఠశాలలో విద్యార్థిని చెట్టుకు కట్టేసి కొట్టిన ప్రిన్సిపాల్.పోలీసులను ఆశ్రయించిన విద్యార్థి తల్లిదండ్రులు
సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి అక్షర పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నవీన్ అనే విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్ చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం గురించి తల్లిదండ్రులకు విద్యార్థి చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వటిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం మధ్యాహ్నం 1:00 సమయంలో ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్ పై ఫిర్యాదు చేశారు. తమ కొడుకును విచక్షణ రహితంగా కొట్టడానికి కారణం ఏంటో అంటూ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ప్రశ్నించారు.