సర్వేపల్లి: ఇరుముడి ధరించి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి బయలుదేరిన భవానీలు
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. భవాని మాలధారణ చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయ్యప్ప గుడి వద్ద ఇరుముడి ధరించిన భవానీలు కాలినడకన ర్యాలీగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. జై భవాని నామస్మరణతో నెల్లూరు నగరం మారుమోగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో భద్రత ఏర్పాటు చేశారు.