కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తోటపల్లి గూడూరు మండలం పేడూరులో ఆయన పర్యటించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేశారని.. చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వెల్లడించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసిపి అధికారంలోకి రావడం