ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద.. విస్తృత తనిఖీలు ఒంగోలు రైల్వే స్టేషన్‌పై ఇక నుంచి డ్రోన్ ద్వారా స్టేషన్ తనిఖీల పర్వం సాగిస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఒంగోలులోని రైల్వే స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్ పరిసరాలను జీఆర్పీ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ వద్ద అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ ఉపయోగిస్తున్నామన్నారు.