దర్శి: దొనకొండలో వీరబ్రహ్మేంద్రస్వామి 417 జయంతి మహోత్సవాలు
ప్రకాశం జిల్లా దొనకొండ లోని శ్రీ ఆనంద ఆశ్రమంలో కార్తీక శుద్ధ ద్వాదశ పురస్కరించుకొని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417 జయంతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి క్షీరాభిషేకం పంచామృత అభిషేకాలు గణపతి పూజ వీరబ్రహ్మేంద్ర అష్టోత్తర సహస్రనామం కాళికాంబ సప్తశతి పారాయణం చేసి మహా నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.