కామారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఓజోన్ పొర దినోత్సవ వేడుకలు
మానవాళికి ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి ఓజోన్ పొర కంటికి రెప్పలా కాపలా కాస్తుందని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. మంగళవారం ప్రపంచ ఓజోన్ పొర దినోత్సవాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.