డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గం సంబంధించిన పలు సమస్యలను డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే విన్నవించారు. ప్రధానంగా కొరిడి -పెర్నాడు - వేనాడు రహదారి అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా మీజూరులో చెక్ డాంల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రవాణా సౌకర్యం లేక ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెక్ డాములు వస్తే సాగునీటి సమస్య తీరుతుందని విన్నవించారు. ఎమ్మెల్యే విజయ శ్రీ చెప్పిన నియోజకవర్గ సమస్యలన్ని విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పంది