జమ్మలమడుగు: బద్వేల్ : డ్వాక్రా మహిళలను బురిడీ కొట్టించిన ఆర్ పి... ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గౌరీ శంకర్ నగర్ లో డ్వాక్రా గ్రూపు సభ్యులను రిసోర్స్ పర్సన్ ఆర్ పి భారతి బురిడి కొట్టించింది. మంగళవారం తెలిసిన వివరాల మేరకు రెండు డ్వాక్రా గ్రూపు సభ్యుల వద్ద నుంచి సుమారు పది లక్షల రూపాయలు డబ్బులు మోసం చేసి తీసుకొని పరారైనట్లు సంబంధిత డ్వాక్రా గ్రూపు మహిళలు వాపోతున్నారు. భారతి కి ఫోన్ చేస్తున్న ఫోను లిఫ్ట్ చేయడం లేదని, అందుబాటులోకి రావడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పైన బద్వేల్ అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చామని, అలాగే బ్యాంక్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు.