భారీ వర్షాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Oct 23, 2025
ప్రకాశం జిల్లాలో అల్పపీడన మరియు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఒంగోలు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలతో పాటు,జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న అంశాలను అధికారులతో చర్చించారు. వైద్య ఆరోగ్యశాఖ విద్యుత్ మరియు పంచాయతీ పోలీస్ తో పాటుగా ఇరిగేషన్ మరియు పౌరసరఫరా శాఖ అధికారులు తో సమీక్ష నిర్వహించి పలు అంశాలను చర్చించారు.