మేడ్చల్: ఇందిరా పార్కులో బీసీ జాక్ నాయకత్వంలో ధర్నా నిర్వహించిన ఉప్పల్ నియోజకవర్గం నాయకులు
42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్కులో బీసీ జాక్ నాయకత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గం నుంచి నిర్ధం భాస్కర్ గౌడ్, గజ్జల సత్తిరాజు గౌడ్, దేవసాని బాలచందర్, గోనె శ్రీకాంత్ తదితర బీసీ జాబు నాయకులు పాల్గొన్నారు.