రాయదుర్గం: శ్రీనివాస క్యాంపులో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బొమ్మనహల్ మండలం శ్రీనివాస క్యాంపులో గురువారం ఉదయం ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలన్న మంచి సంకల్పంతో వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. స్కానింగ్ తో పాటు, ఇతరాత్ర వైద్య పరీక్షలు కూడా ఇందులో ఏర్పాటు చేయడం మారుమూల గ్రామాల్లో ఉండేవాళ్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.