అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలోని ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలి:DYFI జిల్లా కార్యదర్శి కార్తీక్
ASF జిల్లాలోని ఆర్ఎంపీ ఆసుపత్రులలో పదుల సంఖ్యలో పడకలు ఏర్పాటు చేసుకొని అవసరం లేకుండా ప్రజలకు హైడోస్ ఇంజెక్షన్స్ ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని DYFI జిల్లా కార్యదర్శి కార్తీక్ ఆరోపించారు. గురువారం ASF కలెక్టర్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీ వైద్యులు తమ హద్దులు దాటి వైద్యం చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో DMHOకు పిర్యాదు చేసిన ఫలితం లేదన్నారు.