మేడ్చల్: ఎల్లంపేట చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టిన మినీ బస్సు
ఎల్లంపేట చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై మినీ బస్సు అదుపుతప్పి డివైడర్ను దాటి అవతలి వైపు నుంచి వస్తున్న మూడు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన మాలోతు శ్రీనివాస అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బస్సు బ్రేకులు విఫలం కావడమే కారణం అని డ్రైవర్ తెలుపగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.