కరీంనగర్: పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి : SFI రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్
సోమవారం సాయంత్రం 4గంటలకు SFI కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశం మంకమ్మతోటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా SFI రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్ హాజరైనారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ఈనెల 23 నుండి 25 వరకు జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిని జయప్రదం చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. ఏ క్లాసులకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 500 ప్రతినిధులు హాజరవుతున్నారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.